ఖర్చులు పెరిగిపోతే ఆర్థిక పరిస్థితి గాడి తప్పే ప్రమాదం ఉంది

ప్రణాళిక ప్రకారం పేదలను పేదరికం నుంచి బయటపడేలా కార్యక్రమాలు చేపడితే మంచిది. అంతేకానీ ఓట్లు తెచ్చుకునేందుకు అన్నట్లుగా పథకాలు సరికావు. ఇవి ప్రభుత్వంపై అప్పటికప్పుడు వచ్చిన వ్యతిరేకత తగ్గించవచ్చేమో గానీ, అప్పుల భారం పెరిగిపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఫిస్కల్ డెఫిషియట్ 25లోపు ఉండాలి. కానీ ఇప్పుడు అది పెరిగిపోయింది.’
నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ శివారుల్లోని భూములు వేలం వేస్తోంది ప్రభుత్వం. కోకాపేట, బుద్వేల్, షాబాద్, మోకిల ప్రాంతాలను ఎంచుకుంది. అలాగే మద్యం టెండర్ల కేటాయింపు ప్రక్రియను మూడు నెలల ముందే చేపట్టింది. తకుముందు హైదరాబాద్ లోని అవుటర్ రింగు రోడ్డును 30ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనివల్ల ఏటా 7380 కోట్లు సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. కేంద్రమేమో మెడపై కత్తి పెట్టి రావాల్సిన పైసలు రానివ్వడం లేదు. అందుకే సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు సమీకరణకు ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలో క్యాబినెట్ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ ఏర్పాటు చేశాం.
కల్యాణలక్ష్మి ఆపాలా.. రైతుబంధు ఆపాలా.. రైతు బీమా ఆపాలా.. పింఛన్లు ఆపాలా.. వాటిని కొనసాగించేందుకు కమిటీ సూచనల మేరకు ఓఆర్ఆర్ ద్వారా నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించాం.’’ అని చెప్పారు. వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాన్ని కొత్తగా చేపట్టే కార్యక్రమాలకు మళ్లించవచ్చని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మున్ముందు ఆర్థిక స్థితిగతులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.