మల్లారెడ్డి విద్యాసంస్థల అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విచారణ హర్షనీయం: కోట శ్రీనివాస్

హైదరాబాద్ వెలుతురు జూలై 19:

మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన విద్యాసంస్థలపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోట శ్రీనివాస్ గౌడ్ చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, జేఎన్‌టీయూహెచ్ (JNTUH) అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి సమగ్ర తనిఖీలు చేపట్టారు. కళాశాలలు స్థాపించిన నాటి నుండి భూముల యాజమాన్యం, అనుమతులు, ఆర్థిక లావాదేవీలు, వేతన చెల్లింపులు, బ్యాంకు రికార్డులు, పరిపాలనా వ్యవహారాలు, సిబ్బంది నియామకాలు తదితర అంశాలపై లోతైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఇది సాధారణ అనుబంధ తనిఖీ కాకుండా ప్రత్యేక సమగ్ర విచారణగా కనిపిస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న తనిఖీల సందర్భంగా కొందరు అధికారులు ఇప్పటికీ కొన్ని కళాశాలలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒక మాజీ రిజిస్ట్రార్ కళాశాల ప్రతినిధులతో చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలపై కూడా, జేఎన్‌టీయూహెచ్ నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని కోరారు. విచారణ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహరించరాదని అన్నారు.

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌కు సంబంధించి భూముల యాజమాన్యం, భూ వినియోగ మార్పిడి (Land Conversion), వ్యవసాయ భూములపై కళాశాల నిర్మాణం, ప్రభుత్వ వ్యవసాయ ప్రయోజనాల వినియోగం, అలాగే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి సమర్పించిన పత్రాలు, వాస్తవ నిర్వహణ మధ్య ఉన్న వ్యత్యాసాలపై కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అలాగే MRCET సహా మరికొన్ని కళాశాలల్లో ఏఐసీటీఈ అనుమతులు పొందిన సర్వే నంబర్లకు భిన్నంగా ప్రస్తుతం కార్యకలాపాలు సాగుతున్నాయనే అంశాన్ని అధికారులు భౌతికంగా, రికార్డుల పరంగా పరిశీలించాలని కోరారు.

విద్యార్థుల భవిష్యత్తు, ప్రజా ప్రయోజనాలు, విద్యా వ్యవస్థ ప్రతిష్ఠను కాపాడటమే తన పోరాట లక్ష్యమని, అక్రమాలపై తన పోరాటం కోనసాగిస్తానని మరిన్ని కీలక ఆధారాలను విచారణ కమిటీకి అధికారికంగా అందిస్తానని తెలిపారు.

కోట శ్రీనివాస్ గౌడ్ (PhD )
ఓయూ విద్యార్థి నాయకుడు,
టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు

Kota Srinivas Goud
Comments (0)
Add Comment