మచ్చ వేణుగోపాల్ రెడ్డికి మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పరామర్శ

సిద్దిపేట, వెలుతురు, ఆగష్టు 12:

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మాతృమూర్తి జయమ్మ మృతి పట్ల ఎన్నారై బిఆర్ఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్ అనిల్ కూర్మాచలం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జయమ్మ మృతి చెందిన వార్త తెలుసుకున్న ఆయన సిద్దిపేటలోని వేణుగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి జయమ్మ భౌతికకాయాన్ని దర్శించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మాతృవియోగంతో తీవ్ర విషాదంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులందరూ మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. జయమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకుడు తిరుమందాస్ నరేష్ గౌడ్, ఏఎస్ఆర్, సంతోష్ పాల్గొని తమ సానుభూతిని తెలియజేశారు.

Anil Kurmachalam
Comments (0)
Add Comment