ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ… రేపు చలో హైదరాబాద్‌కు పిలుపు!

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 17:

బహుజన చక్రవర్తి,  గోల్కొండను పరిపాలించిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఆగస్టు 18న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై  నిర్వహించనున్న పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వినాయకనగర్, ఓల్డ్ సఫిల్‌గూడ గౌడ సంఘం సభ్యులు ఆవిష్కరించారు.

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ పెద్ద సంఖ్యలో గ్రామాల నుంచి బహుజనులు, గౌడ సంఘాల ప్రతినిధులు, ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాషా గౌడ్, నందం గౌడ్, పోచయ్య గౌడ్, నరసింహ గౌడ్, బాలేష్ గౌడ్, కృష్ణమూర్తి గౌడ్, విష్ణుమూర్తి గౌడ్, కృష్ణ గౌడ్, శేఖర్ గౌడ్, శశి గౌడ్, జగన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాములు గౌడ్, నరసింహ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Ponnam PrabhakarSardar Sarvai Papanna Goud
Comments (0)
Add Comment