కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి పొన్నం

కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి పొన్నం

కరీంనగర్, వెలుతురు : శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ దుర్గాదేవి రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ammavaruBandi SanjayPonnamtemple
Comments (0)
Add Comment