స్పెషల్‌ బస్సులకు బోర్డులు పెట్టి దోపిడీ : హరీశ్‌రావు

స్పెషల్‌ బస్సుల పేరుతో ప్రజలపై అదనపు భారం: హరీశ్‌రావు

హైదరాబాద్‌ : బతుకమ్మ, దసరా పండుగల వేళ ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల పేరుతో టికెట్‌ ఛార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఆరోపించారు. రెగ్యులర్‌ బస్సులను తగ్గించి, వాటికే స్పెషల్‌ బోర్డులు తగిలించి అధిక ఛార్జీలు వసూలు చేయడం ప్రజాపీడనగా అభివర్ణించారు.

జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌కు రూ.230గా ఉన్న టికెట్‌ను రూ.400కు, మహబూబ్‌నగర్‌ నుంచి ఎంజీబీఎస్‌కు రూ.220గా ఉన్న ఛార్జీని రూ.290కిపైగా పెంచారని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెబుతూ పురుషుల నుంచి డబుల్‌ ఛార్జీలు వసూలు చేయడం వల్ల అదే కుటుంబంపై అదనపు భారం పడుతోందన్నారు. పండుగల పేరుతో పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించి, రెగ్యులర్‌ బస్సులను యథావిధిగా నడపాలని బీఆర్‌ఎస్‌ తరఫున డిమాండ్‌ చేశారు.

buschargesHarish Raohiketicket
Comments (0)
Add Comment