మహిషాసురమర్ధిని దేవి అవతారంలో అమ్మవారు
కరీంనగర్, వెలుతురు, అక్టోబర్ 19 :
కరీంనగర్‌లోని శ్రీ మహాదుర్గ ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం మహర్నవమి సందర్భంగా శ్రీ మహిషాసురమర్ధిని దేవి (సిద్ధిదాత్రి) అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు భక్తులను కటాక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.