సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 20 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మహేష్‌కుమార్ గౌడ్ పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోహిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.