అరగంట పాటు సీఎం రేవంత్ రెడ్డి–మహేష్ కుమార్ గౌడ్ భేటీ

అరగంట పాటు సీఎం రేవంత్ రెడ్డి–మహేష్ కుమార్ గౌడ్ భేటీ

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 20 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అరగంట పాటు ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల ఖాళీ అయిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీతో పాటు, కొత్తగా నియమించాల్సిన కార్పొరేషన్ చైర్మన్ల అంశంపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. పార్టీ నాయకులు, ఆశావహుల పేర్లు, సామాజిక సమీకరణాలు, పదవుల భర్తీపై కూడా ఇరువురు నేతలు సమీక్షించినట్లు సమాచారం.

ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక చర్చ

వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కూడా భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సమీకరణాలపై చర్చించినట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వివిధ వామపక్ష, ఇతర పార్టీలతో జరుపుతున్న చర్చలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నాల నేపథ్యంలో సీఎం–పీసీసీ చీఫ్ భేటీ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పార్టీ బలోపేతం.. ఎన్నికల వ్యూహంపై దృష్టి

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత సమన్వయం చేయడం, నాయకులకు బాధ్యతలు అప్పగించడం వంటి అంశాలపైనా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కార్పొరేషన్ పదవుల భర్తీతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలను సమన్వయంగా ముందుకు తీసుకెళ్లే దిశగా భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

bheticmdiscussmeetrevanthTpcc
Comments (0)
Add Comment