- బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 విజయవంతంపై అభినందనలు తెలిపిన సీఎం
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 20 :
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహణ, విజయవంతం గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. ముకుంద రెడ్డిని సీఎం అభినందించారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌కు సంబంధించిన అవార్డును కొండా రాజు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం యువ ఫిల్మ్ మేకర్స్‌కు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.