పోలీస్ శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 21 :
ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని భారీగా పెంచామని వెల్లడించారు. 2028 నాటికి పోలీస్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో మహిళా భద్రత, డ్రగ్స్ గంజాయి సైబర్ నేరాల కట్టడి, కల్తీ ఆహారంపై ప్రభుత్వ చర్యలపై సీఎం వివరాలు వెల్లడించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీస్ స్మారక పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌తోపాటు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వారి సేవలను స్మరించుకుంటూ రూపొందించిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అమరులకు నివాళి అర్పించిన అనంతరం ప్రసంగించిన సీఎం, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం భావోద్వేగంతో కూడిన రోజని పేర్కొన్నారు. సమాజం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసుల సేవలను మరువలేమన్నారు. అమరుల కుటుంబాల్లో ఏర్పడిన లోటును ఎవరూ భర్తీ చేయలేరని అయితే వారి కుటుంబాలు ఒంటరివి కావని, తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ, సమాజం అండగా