పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 21:
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరటనిచ్చేలా పసిడి ధర తగ్గింది. అక్టోబర్ 21, బుధవారం బంగారం ధరలో భారీ మార్పు కనిపించింది. సోమవారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,720 తగ్గింది. మరోవైపు వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ.1,027 పెరుగుదల నమోదైంది.
క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో బుధవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,46,080గా ఉంది. సోమవారం ఈ ధర రూ.1,47,800గా నమోదైంది. దీంతో రెండు రోజుల్లోనే రూ.1,720 తగ్గింది. ముంబయి, బెంగళూరు, చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు వంటి నగరాల్లోనూ ఇదే ధరలు నమోదవుతున్నాయి. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,900గా ఉంది.