మణిపూర్ హింసాకాండపై కాంగ్రెస్ సిరియస్

మణిపూర్ హింసాకాండపై కాంగ్రెస్ సిరియస్

 

న్యూఢిల్లీ, వెలుతురు, అక్టోబర్ 21 :

 

మణిపుర్‌లో కొనసాగుతున్న హింసాకాండపై కాంగ్రెస్‌ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. వ్యూహాత్మకంగా కీలకమైన సరిహద్దు రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో, రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో, జాతీయ భద్రతను రక్షించడంలో బీజేపీ విఫలమైందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు. ఇటీవల నలుగురు అమాయక పౌరులు హత్యకు గురికావడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మే 2023 నుంచి ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 24,530 మంది సహాయక శిబిరాల్లో దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Delhi
Comments (0)
Add Comment