తెలంగాణ స్పీకర్ కు వైఎస్ షర్మిల ఆహ్వానం

తెలంగాణ స్పీకర్ కు వైఎస్ షర్మిల ఆహ్వానం

 

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 23 :   ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కూతురు వైఎస్ అంజలి రెడ్డి వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యుల గడ్డం ప్రసాద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

 

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ ప్రసాద్ కుమార్ ని కలిసిన వైఎస్ షర్మిల దంపతులు, నవంబర్ 25, 2026న జరగనున్న అంజలి రెడ్డి వివాహ పత్రికను అందజేశారు.

 

వైఎస్ అంజలి రెడ్డి, డాక్టర్ సోమల రఘురాం రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ వివాహం నవంబర్ 25న జరగనుండగా, డిసెంబర్ 5న రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా కాబోయే నూత‌న‌ వధూవరులు సుఖసంతోషాలతో, సుసంపన్నమైన వైవాహిక జీవితాన్ని గడపాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డితో త‌న‌కు ఉన్న అనుబంధం గురించి ష‌ర్మిల వ‌ద్ద స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ ప్ర‌స్తావించారు.

Telangana
Comments (0)
Add Comment