పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 23 : : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు సీపీఐ రాష్ట్ర నాయకత్వంతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్‌ బోస్‌, ఈటీ నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, కలవేని శంకర్‌, బాల నరసింహ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

 

 

 

రానున్న హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌, నల్గొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు సీపీఐ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

 

వామపక్షాలు, కాంగ్రెస్‌ మధ్య రాష్ట్రస్థాయిలో ఉన్న రాజకీయ సమన్వయం, పట్టభద్రుల ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సీపీఐ నేతలు పార్టీ అంతర్గతంగా చర్చించి మద్దతుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

HyderabadTelangana
Comments (0)
Add Comment