కేటీఆర్ అధికారంలోకి రావడం కలే.. : చనగాని

కేటీఆర్ అధికారంలోకి రావడం కలే.. : చనగాని

 

హైదరాబాద్‌, వెలుతురు, అక్టోబర్ 23 : ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాలపైనా కేటీఆర్‌ రాజకీయాలు చేయడం సరికాదని టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ చనగాని దయాకర్‌ విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటాయని, దాని ప్రభావం రాష్ట్రంపై పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. విద్యుత్‌ కొరత లేకుండా, రైతాంగానికి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కరువు పరిస్థితులపై మంత్రి వర్గ కమిటీ ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.

 

కేటీఆర్‌ బాధ్యత కలిగిన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, నీచ రాజకీయాలు మానుకోవాలని దయాకర్‌ సూచించారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై కేటీఆర్‌ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని, పదేళ్ల పాలనలో రైతులకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కేటీఆర్‌ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని దయాకర్‌ అన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

changaniCongressTelangana
Comments (0)
Add Comment