కరువు పరిస్థితులపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ

కరువు పరిస్థితులపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ

 

హైదరాబాద్, వెలుతురు,  అక్టోబర్ 23 :  ‎రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఎల్-నినో పరిస్థితులను అధిగమించేందుకు, తగిన చర్యలను సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సబ్-కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రారంభమైన

‎క్యాబినెట్ సబ్-కమిటీ సమావేశం. ‎రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కరువు ప్రభావం, నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన ఉపశమనం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ‎ఈ సమావేశానికి సబ్-కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సిఎస్ సంజయ్ జాజుతో పాటు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

elnino effectHyderabadTelanganaveluthuruweb news
Comments (0)
Add Comment