నాలుగో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు 

నాలుగో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

 

ముంబై, వెలుతురు, అక్టోబర్ 23 :  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 125.56 పాయింట్లు నష్టపోయి 73,123.83 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 87.65 పాయింట్లు క్షీణించి 22,600 వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిణామాలపై ఆందోళనలతో మదుపర్లు రిస్క్‌ తీసుకోవడానికి వెనుకాడారు.

 

మార్కెట్‌లో ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 2.21 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 2.94 శాతం పడిపోయాయి. నిఫ్టీ షేర్లలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ అత్యధికంగా నష్టపోయిన వాటిలో నిలిచాయి. మెటల్‌, ఆర్థిక రంగ షేర్ల బలహీనత కూడా సూచీలపై ప్రభావం చూపింది.

mumbainational newsstock market
Comments (0)
Add Comment