రెండు సైనిక విమానాలు ఢీకొని నలుగురు మృతి
మనీలా, వెలుతురు, అక్టోబర్ 24 : ఫిలిప్పైన్స్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫిలిప్పైన్స్ సైన్యానికి చెందిన రెండు శిక్షణ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు పైలట్లు మరణించారు. ఈ ఘటన ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా దక్షిణ ప్రాంతంలో ఉన్న ఎయిర్ బేస్ వద్ద శుక్రవారం జరిగింది. స్థానిక బటాంగాస్ ప్రావిన్స్‌లోని ఫెర్నాండో ఎయిర్ బేస్ సమీపంలో ఎస్ఎఫ్-260 అనే రెండు యుద్ధ విమానాలు గాలిలోనే ఢీకొన్నాయి. ఈ సమయంలో రెండు విమానాల్లో ఉన్న నలుగురు పైలట్లు మరణించారు.