- కేక్ కట్ చేసి ఘనంగా వేడుక
- శాలువాతో సన్మానించిన సంఘం నాయకులు
- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జాతీయ సంఘం శుభాకాంక్షలు
ఎల్‌బీ నగర్ వెలుతురు జూన్ 15:ఎల్‌బీ నగర్ ఏసీపీ అమరగాని కృష్ణయ్య గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జాతీయ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.జాతీయ సంఘం అధ్యక్షులు బొంగు రఘు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొని ఏసీపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి గౌరవం తెలిపారు.
ఈ కార్యక్రమంలో సురిగి నర్సింహ గౌడ్, సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దగోని వెంకట్ గౌడ్, మధుకర్ గౌడ్, కిరణ్ గౌడ్, పార్వతి గౌడ్, పాలెం వెంకటేష్ గౌడ్, నర్సింహ, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.