ప్రజలకు మెరుగైన సేవలు అందాలి: డీజీపీ సీవీ ఆనంద్

  • పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణపై డీజీపీ సమీక్ష
  • సీపీలతో కీలక సమావేశం నిర్వహించిన అధికారులు
  • నాలుగు కమిషనరేట్ల పరిధిలో పునర్వ్యవస్థీకరణపై చర్చ
  • భవిష్యత్ నగర విస్తరణను దృష్టిలో ఉంచాలని సూచన
  • జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలన్న ఆదేశం
  • ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రక్రియ చేపట్టాలని స్పష్టీకరణ
  • మున్సిపల్, రెవెన్యూ, కోర్టు పరిధులను పరిగణనలోకి తీసుకోవాలని సూచన
  • ప్రజాప్రతినిధులు, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపాలని ఆదేశం
  • హైదరాబాద్ కమిషనరేట్‌లో కొన్ని స్టేషన్ల పరిధులపై ప్రత్యేక మార్గదర్శకాలు
  • ప్రజాకేంద్రిత పోలీసింగ్ లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణ
  • సేవల మెరుగుదలే ప్రధాన ఉద్దేశమని స్పష్టం

హైదరాబాద్ వెలుతురు జూలై 02:

హైదరాబాద్ నగర పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీయూఆర్‌ఈ (క్యూర్) పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లతో సమావేశమై పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా నగర భవిష్యత్ విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తూ, మున్సిపల్, రెవెన్యూ, న్యాయస్థానాల పరిధులకు అనుగుణంగా ఈ ప్రక్రియను అమలు చేయాలని ఆదేశించారు. అలాగే సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే తుది నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్ల హద్దుల నిర్ణయంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రజాకేంద్రిత పోలీసింగ్‌కు మరింత బలం చేకూర్చడంతో పాటు ప్రజలకు అందించే సేవలు మరింత సమర్థవంతంగా ఉండేలా చూడాలని నాలుగు కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లకు సూచించారు.

CV AnandTelangana State Police
Comments (0)
Add Comment