రాముడి హుండీలోని విరాళాలను ఎత్తుకెళ్లడం దేశ ప్రజలకు అవమానకరం: పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుతురు జూలై 06:

రాముడి హుండీలోని విరాళాలను ఎత్తుకెళ్లడం దేశ ప్రజలకు అవమానకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజలు హిందువుల విశ్వాసం అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎంతో మంది విరాళాలు ఇచ్చారని, కానీ కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, బీజేపీ నాయకుల అవినీతిని అయోధ్య ప్రజలు ముందుగానే గుర్తించి ఆ పార్టీ ఎంపీని ఓడించారన్నారు.  బీజేపీ నాయకులు దేవుని పేరుతో, అక్షింతలపై విరాళాలు అడుక్కున్నారని విమర్శించారు.  అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణం జరగాలని రాజీవ్ గాంధీ శిల్యానస్​ వేశారని మంత్రి పొన్నం ప్రభాకర్​ గుర్తు చేశారు. రామాలయంపై బీజేపీ పెద్దలు స్పందించాలన్నారు. రాముడి పేరు మీద రాజకీయాలు చేసే వారు మాట్లాడాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్‌) జరుగుతుంది

తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఓటరు ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ, వివరాల నమోదు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేస్తున్నారని, బూత్‌ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏ), బీఎల్‌వోలు సమన్వయం చేసుకుంటూ అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని, బీఎల్‌వోలు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. సర్‌లో రాజకీయ పార్టీలు, బూత్‌ స్థాయి ఏజెంట్లు(బీఎల్‌ఏ) పాల్గొని తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.

డీఈవోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఓటరు అవగాహన కార్యక్రమాలను సమీక్షిస్తూ, సామాజిక మాధ్యమాల్లో క్రమం తప్పకుండా వివరాలను ప్రచురించాలన్నారు. అధికారుల క్షేత్ర పర్యటనలను సమగ్రంగా నమోదు చేయాలన్నారు.

Ayodhya NewsAyodhya Ram MandirPonnam Prabhakar
Comments (0)
Add Comment