తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న హర్కర వేణుగోపాల్ రావు

మంచిర్యాల జిల్లా వెలుతురు జూన్ 02: మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు *హర్కర వేణుగోపాల్ రావు* ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హర్కర వేణుగోపాల్ రావు అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు, సాంస్కృతిక నృత్యాలను ప్రత్యక్షంగా వీక్షించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ హర్కర వేణుగోపాల్ రావు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖలో పని చేస్తున్న ఏ ఆర్ ఎస్ ఐలకు వికలాంగులకు ఉత్తమ సేవా పథకం కింద బ్యాటరీ సైకిళ్లు, స్కూటీలను అందించారు.ఈ వేడుకల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్, డీసీపీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment