గుడిపాటికి దాశరథి పురస్కారం

హైదరాబాద్, వెలుతురు (జులై 19):

దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం’ ఈ ఏడాదికిగాను ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, పాలపిట్ట సాహిత్య పత్రిక సంపాదకులు గుడిపాటికి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

ఈ నెల 22న రవీంద్రభారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా గుడిపాటికి పురస్కారంతో పాటు రూ. 1,01,116 నగదు బహుమతితో సత్కరిస్తారు. దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారానికి ఎంపికైన గుడిపాటికి పలువురు కవులు,రచయితలు శుభాకాంక్షలు తెలిపారు.

Dasharathi Krishnamacharya AwardRavindra Bharathi
Comments (0)
Add Comment