మునుగోడు,అక్టోబర్ 2 (వెలుతురు) : ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆర్థికంగా అండగా నిలుస్తోందని సర్పంచ్ గొపగోని పాపయ్యగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గంగోరిగూడెం గ్రామానికి చెందిన బొంత ఎల్లమ్మకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహకారంతో మంజూరైన రూ.29 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.