ఎల్లమ్మకు రూ.29 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు

మునుగోడు,అక్టోబర్ 2 (వెలుతురు) : ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆర్థికంగా అండగా నిలుస్తోందని సర్పంచ్ గొపగోని పాపయ్యగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గంగోరిగూడెం గ్రామానికి చెందిన బొంత ఎల్లమ్మకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో మంజూరైన రూ.29 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేష్‌గౌడ్,వార్డు సభ్యుడు బొంత వెంకటయ్య,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపగోని స్వామి, బాలరాజ్,ఈర్ల కోటిలింగం,సైదులు, లింగస్వామి,శవగోని వెంకన్న,పానుగంటి వెంకన్న,గోపగోని నరసింహ,పగిళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.