- నేటితో ముగిసిన ఇరువైపుల వాదనలు
- కనీసం తెలంగాణలో విడుదలకు అవకాశమివ్వాలన్న సినీ నిర్మాత
- రేపు తీర్పును వెలువరించనున్న హైకోర్టు
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ ముగిసింది. నేటితో ఇరువైపుల వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు… రేపు వెలువరిచనుంది.
ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ నారా లోకేశ్ కోర్టుకు వెళ్లారు. దీంతో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత హైకోర్టును కోరారు.
తమ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తే కనీసం తెలంగాణలో విడుదల చేయడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే వ్యూహం సినిమా నిర్మాత న్యాయవాది విజ్ఞప్తిపై నారా లోకేశ్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.