‘పద్మ’ పురస్కారాల విజేతలకు రేపు తెలంగాణ ప్రభుత్వ సన్మానం

  • హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ చేతుల మీదుగా సన్మానం
  • సీఎం తరపున వెంకయ్య నాయుడు, చిరంజీవిని ఆహ్వానించిన మంత్రి జూపల్లి
  • పద్మశ్రీ పురస్కార విజేతలకు సాంస్కృతిక శాఖ అధికారుల ఆహ్వానం

పద్మ పురస్కారాలకు ఎంపికైన విజేతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. రేపు శిల్పకళా వేదికలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పద్మవిభూషన్‌కు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవిని మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి తరపున ఆహ్వానించారు. వెంకయ్యనాయుడును జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో, చిరంజీవిని అన్నపూర్ణ స్టూడియోస్‌లో మంత్రి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువా కప్పి, పుష్ప గుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు.

వెంకయ్య నాయుడు, చిరంజీవితో పాటూ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్‌లాల్, శిల్పకారుడు సత్తి ఆనందాచారిని రేపు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. పద్మశ్రీ విజేతలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించాలని మంత్రి జూపల్లి సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.