ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు

వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికి నెలకు రూ.3వేలు చొప్పున చేనేత కార్మికులకు ఆర్థిక సాయం

నిర్దేశిత నిబంధనల మేరకు పనిచేస్తున్న జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లను వేర్వేరు శాఖల్లో సర్దుబాటు చేయడం.. ఇందుకు వివిధ శాఖల్లో 14954 పోస్టులు మంజూరు.

మెట్రో రైల్ మూడో ఫేజ్ ప్రకటన.. రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో 60,100 కోట్ల రూపాయలతో 142 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు నిర్మంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం.

అవుటర్ రింగు చుట్టూ 136 కిలోమీటర్ల లైనును ప్రతిపాదించింది. ఇప్పటికే హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ లైన్ ఉంది.
దీనికి అదనంగా రెండో ఫేజ్ కింద ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల లైను విస్తరిస్తోంది. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు 5కిలోమీటర్లు రెండో దశలోనే ప్రతిపాదించింది.

అనాథల కోసం ప్రత్యేకంగా పాలసీ ప్రకటన. వారిని రాష్ట్ర ప్రభుత్వ పిల్లలు గుర్తించాలని నిర్ణయం.

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఐఆర్.. పీఆర్సీ వేయాలని నిర్ణయం

సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్ల బోనస్.. గతంలో దసరా, దీపావళి బోసన్ రెండూ కలిపి రూ.83కోట్లు ఇచ్చేవారు.

7వేల మంది మౌజం, ఇమామ్ లకు నెలకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయం

పట్టణ ప్రాంతాల్లో అసైన్డ్ భూములన్న వారికి అమ్ముకునేందుకు హక్కులు కల్పించాలని నిర్ణయం.

రేషను డీలర్ల కమిషన్ రూ.900 నుంచి 1400 వరకు పెంపు.. రేషను డీలర్లకు రూ.5లక్షల కమిషన్ అమలుకు నిర్ణయం.

బీడీ కార్మికులతోపాటు టేకేదారులకు పింఛను ఇవ్వాలని నిర్ణయం

నోటరీ దస్తావేజుల ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణ..

Leave A Reply

Your email address will not be published.