త్రీ సభ్య కమిటీ చైర్మన్ గా సంజయ్ కుమార్
సభ్యులుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య లు
ఆర్టీసీ ఉద్యోగుల సర్వీస్ సమస్యల పరిష్కారం కోసం త్రీ సభ్య కమిటీ
(రాపర్తి భాస్కర్ గౌడ్)
వెలుతురు. హైదరాబాద్ బ్యూరో, డిసెంబర్ 12:
ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు నిత్యం ఆర్టీసీకి సంబంధించిన సర్వీసు రిమూవల్ కేసుల పై స్పందించి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులలో సర్వీస్ నిమిత్తం వివిధ కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.లేబర్ఎంప్లాయిమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్ గా ,ఆర్టీసీ ఎండీ సజ్జనార్ , ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య సభ్యులుగా ఈ త్రిసభ్య కమిటీ పనిచేయనుందని మంత్రి ప్రభాకర్ తెలిపారు,ఆర్టీసీలో ఉన్న ఉద్యోగుల్లో గతంలో సర్వీస్ రిమూవల్ కేసులు నమోదైన వాటిపై ఈ త్రి సభ్య కమిటీపరిశీలించనుందన్నారు.ఇప్పటికే ప్రజావాణి లో ఆర్టీసీ కి సంబందించిన సర్వీస్ రిమువల్ కేసుల విషయమై ఫిర్యాదులను ఈ త్రిసభ్య కమిటీ పిలిచి రివ్యూ చేయనుంద ని తెలిపారు,త్రిసభ్య కమిటీ కేసులో ఉన్న మెరిట్స్ ను బట్టి ఆర్టీసీ యాజమాన్యానికి రికమెండ్ చేయనుందని రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ పేర్కొన్నారు,
