మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ హింసతో అట్టుడికిపోతోంది. చాలామంది మణిపూర్ పౌరులు తమ ప్రాణాలు కాపాడు కోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. షరా మామూలుగానే కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష పార్టీలు మణిపూర్ లో అధికారంలోవున్న బిజెపిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బిజెపి ఈ విమర్శలను గట్టిగా ఖండిస్తోంది.ఈ రాజకీయ విమర్శలు , ప్రతి విమర్శలు పక్కనపెట్టి నిష్పక్షపాతంగా మణిపూర్ సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే మనకు ఎన్నో భయంకరమైన కుట్రలు తెలుస్తాయి.మణిపూర్ కు ఆ పేరు రావడానికి కారణం అక్కడ అతి విలువైన మణులు విరివిగా దొరికేవట. పురి అంటే పట్టణం. మణులపురం మణిపూర్ గా మారింది. అర్జునుడి భార్యల్లో ఒకరైన చిత్రాంగద పుట్టింది మణిపూర్ లొనే. వారి కొడుకైన బబృవాహనుడు , మణిపూర్ ను చాలా కాలం పరిపాలన చేసాడు. వైష్ణవ పరంపర కు చెందిన హిందువులు అక్కడ జీవించేవారు. 1894 లో ఇంగ్లాండు కు చెందిన విలియం పెట్టిగ్రు అనే ఒక క్రైస్తవ మిషనరీ మణిపూర్ వచ్చాడు. అంతవరకూ అక్కడ అమెరికన్ బ్యాప్తిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ మతమార్పిడులు చేస్తుండేది. అపుడు ఈ పెట్టిగ్రు బ్యాప్టిస్ట్ గా మారి తన ఇవాంజలీజం ను వేగవంతం చేసాడు.మణిపూర్ ప్రధానంగా రెండు ప్రాంతాలు. లోయ ప్రాంతం , కొండప్రాంతం. లోయ ప్రాంతంలో హిందువులు వుంటారు. కొండ ప్రాంతంలో ఆదివాసీలు వుంటారు. వీళ్ళలో కుకీలు ముఖ్యమైన వారు. ఈ రెండు ప్రాంతాల్లో ని వాళ్లకు గొడవలు లేవు. సామరస్యంగా వుండేవారు. ఇద్దరి మధ్య పెళ్లిళ్లు కూడా జరిగాయి. పెట్టిగృ మొదట కొండ ప్రాంతమైన యూకృల్ వెళ్ళాడు. అక్కడ ఒక బడిని , ఆసుపత్రిని ప్రారంభించాడు. పెట్టిగృ బైబిల్ ను స్థానిక మాండలికం అయిన తంగకుల్ లోకి అనువాదం చేసాడు. సేవ , విద్య పేరుతో ఆదివాసులను ఆకట్టుకొన్నాడు. తరువాతి రోజుల్లో అక్కడికి వాటికిన్ రాబర్ట్ , యు. ఎం .ఫాక్స్ , డా.జి.జి. క్రోజియర్ అనే క్రైస్తవ మత ప్రచారకులు వచ్చారు.
1914 లో మొదలయిన మొదటి ప్రపంచ యుద్ధం ఈ మొత్తం పరిస్థితి ని మార్చేసింది. ఇంగ్లాండ్ తరపున యుద్ధం చేయడానికి మణిపూర్ లోని కుకీలను ఇక్కడి బ్రిటిష్ ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కుకీలు తిరగబడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం పై కుకీలు గెరిల్లా పోరాటం చేశారు. కుకీల పోరాటం చూసి ఆంగ్లేయులు బిత్తరపొయారు. రెండు సంవత్సరాలు కుకీలు భీకరంగా పోరాడి చివరకు ఓడిపోయారు. అక్కడి నుండి ఈశాన్యప్రాంతంలో బ్రిటిష్ ప్రాబల్యం పెరిగింది.
నెహ్రు `ఇర్విన్ పాలసీ మణిపూర్ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఆదివాసిలను ప్రధాన స్రవంతి లోకితీసుకురావడం , వారి జీవన స్థితి గతులను అధ్యయనం చేయడం అనే అందమైన మాటలు చెప్పారు. మిగిలిన దేశంలో అభివృద్ధి పథంలో అడుగులు వేస్తుంటే , ఈశాన్యం మాత్రం వెనకబడిపోయింది. మణిపూర్ మూడు ప్రధాన గిరిజన తెగలున్నాయి. మేయ్తీ, కూకీ, నాగా తెగలు. అయితే, ప్రభుత్వఉద్యోగాల్లో కుకీలదే సింహభాగం. ఇప్పుడక్కడ జరుగుతున్న ఘర్షణలు మేయ్తీ , కూకీల మధ్య జరగుతున్నదే. ఈ అల్లర్లలో ఈ కుకీలకు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు విదేశీ నిధులు వస్తున్నాయని నిఘా వర్గాల సమాచారం. మణిపూర్ లో కూకేతరులను గుర్తించి మరీ తరిమిగొడుతున్నారు. ఇపుడు ఈ కుకీలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండు చేస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 20 న మణిపూర్ హైకోర్టు మేయ్తీ అనే ఆదివాసీలను కూడా కుకీల లాగా ఎస్టీలలోకి కలపాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. వారికి ఎస్టీ హోదా లభిస్తే విూటేల్, ఇతర ఆదివాసులు భూభాగాలను కొంటారని కుకీలు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. మణిపూర్లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా, ఈ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటాగా స్వీకరించింది. ఇది తమను తీవ్రంగా కలిచివేసిందని, ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. తామే తీసుకుంటామని హెచ్చరించింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరంగా జులై 28లోగా నివేదిక అందజేయాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది.
మణిపూర్ లో ఏం జరుగుతోంది…
Next Post