Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. నాంపల్లి స్టేషన్ లో ఘటన

  • ప్లాట్ ఫాం సైడ్ వాల్ ను ఢీ కొట్టిన రైలు
  • పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు
  • నాంపల్లి మీదుగా నడిచే పలు రైళ్ల ఆలస్యం

హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. స్టేషన్ లో ప్లాట్ ఫాం మీదికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. రైలు ఇంజన్ ప్లాట్ ఫాం సైడ్ వాల్ ను ఢీ కొట్టిందని చెప్పారు. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని వివరించారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా ఓ అంచనాకు రాలేదని తెలిపారు.

స్టేషన్ ప్లాట్ ఫాంపై రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇంజన్ తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.