మధ్యంతర బడ్జెట్ అంచనా రూ.47.66 లక్షల కోట్లు

  • పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి
  • ఎఫ్ డీ ఐ అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా.. అంటూ మంత్రి కొత్త నిర్వచనం
  • పరిశోధన, సృజనాత్మకతకు రూ. లక్ష కోట్ల నిధి ఏర్పాటుకు హామీ

భారత దేశ అభివృద్ధికి రాబోయే ఐదేళ్ల కాలం స్వర్ణయుగం కానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గడిచిన పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశంలో పేదరిక నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేశామన్నారు. తమ సర్కారు కృషితో పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగిందని చెప్పారు. పేదరిక నిర్మూలనకు రాబోయే రోజుల్లోనూ కృషి చేస్తామని, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పారు. వారి సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని వివరించారు. స్వయం సహాయక బృందాల ద్వారా కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని తెలిపారు. ప్రస్తుతం లక్ పతీ దీదీ టార్గెట్ ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి నిర్మల చెప్పారు. పరిశోధన, సృజనాత్మకతకు రూ.లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. గురువారం మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మరిన్ని వివరాలు ..

  • 2024 – 25 అంచనా బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లు
  • రుణాలు మినహా రాబడి : రూ.30.80 లక్షల కోట్లు
  • రెవెన్యూ రాబడి : 26.02 లక్షల కోట్లు
  • ప్రణాళిక వ్యయం : రూ.11.11 లక్షల కోట్లు
  • అప్పులు : రూ.11.75 లక్షల కోట్లు
  • మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ : రూ. 14.13 లక్షల కోట్లు
  • సవరించిన రెవెన్యూ వ్యయం : రూ. 44.90 లక్షల కోట్లు

ఎఫ్ డీఐకి మంత్రి నిర్మల కొత్త నిర్వచనం..
ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ (ఎఫ్ డీఐ) కి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త నిర్వచనం చెప్పారు. ఎఫ్ డీఐ అంటే.. ఫస్ట్ డెవలప్ ఇండియా అంటూ మంత్రి నిర్వచించారు. కాగా, నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్టుబడులకు స్వర్ణయుగంగా మారిందని నిర్మల చెప్పారు. విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వస్తున్నాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.