ఆబ్కారీ ఉద్యోగుల ఆర్థిక చేయూత

  • ప్రైవేట్ ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచిన ఆబ్కారీ ఉద్యోగులు
  • ఆబ్కారీ కమిషనర్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత
  • శాఖ ఉద్యోగుల దాతృత్వాని అభినందించిన కమిషనర్
  • మానవీయ కోణంలో ఎక్సైజ్ కమిషనర్ సైతం ఆర్థిక చేయూత

హైదరాబాద్ వెలుతురు జూలై 21:

తెలంగాణ రాష్ట్ర బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ ఎక్సైజ్ శాఖలో డేట ఎంట్రీ ఆపరేటర్‌గా ఔట్ సోర్సింగ్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న చిర్ర ఏకాంబరం ఈ నెల 8న గుండె పోటుతో మరణించారు. ఆ కుటుంబాన్ని మానవత దృక్పథంతో ఆదుకోవాలనే సంకల్పంతో తెలంగాణ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం, నాన్ గెజిటెడ్ మినిస్టీరియల్ సిబ్బంది, ఎగ్జిక్యూటివ్‌ సంఘాల సభ్యులు అండగా నివ్వాలని అనుకున్నారు. ఈ క్రమంలో వారు తమవంతుగా సాయంగా ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం తరపున ₹ 2, 75,000, మినిస్ట్రియల్ సిబ్బంది తరపున ₹ 71,000 మొత్తం 3,46,000 రూపాయలను ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ చేతుల మీదుగా వారి కుటుంబసభ్యులకు అందజేశారు.

ఎంతో నిబద్ధతతో ఉద్యోగం చేస్తూ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన ఏకాంబరం కుటుంబానికి భరోసా కల్పించి ఆ కుటుంబానికి చేయూత అందించిన ఎక్సైజ్ శాఖ అధికారులను, ఉద్యోగుల సేవానిరతిని ఎక్సైజ్ కమిషనర్ అభినందించి, తనవంతుగా ఆర్థిక చేయూతను ఆ కుటుంబానికి అందించారు.

ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శలు టి. లక్షణ్ గౌడ్, చంద్రశేఖర్ మాట్లాడుతూ తమలో ఒకడిగా భావించిన వ్యక్తి మరణం ప్రతి ఒక్కరినీ తీవ్ర విషాదంలో ముంచిందని, ఏకాంబరం కుటుంబంలోని ఒకరి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని కమిషనర్ హరికిరణ్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్  యాసిన్ ఖురేషి, సైబరాబాద్ ఉప కమిషనర్  జె. హరి కిషన్, టీజీవో అధ్యక్ష, కార్యదర్శలు ఏలూరి శ్రీనివాస రావు, బి.శ్యామ్,  ఎక్సైజ్ అధికారులు కె.విజయ్ కుమార్, బి.ప్రవీణ్ కుమార్, ఎం.రాధ, జయసుధ , సౌజన్య, నాన్ గజిటెడ్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, డి.తిరుపతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.