టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రతినిధి బృందం
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 17:
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 17న హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించనున్న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2026 అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి ఆహ్వానించింది.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు, ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ, జ్యూరీ కమిటీ చైర్మన్, దర్శకుడు హరీష్ శంకర్, పి.జి. విందా, చరణ్ అర్జున్, నల్గొండ గద్దర్, అనిల్ జీలా, బుల్లెట్ బండి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



