భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

విజయనగరం, వెలుతురు, నవంబర్ 24 : విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీ ట్యాంకర్‌ను థార్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో స్థానికులు సుందరపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.