ప్రముఖ విద్యావేత్త పి.టి. స్వామి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

ప్రముఖ విద్యావేత్త పి.టి. స్వామి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 25 :  విద్యావేత్త, సామాజిక కార్యకర్త పి.టి. స్వామి గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యా, సామాజిక, రాజకీయ రంగాల్లో పి.టి. స్వామి గారు అందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు. ఆయన మరణం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. పి.టి. స్వామి గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, దివంగత పి.టి. స్వామి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave A Reply

Your email address will not be published.