కృష్ణా జలాల తరలింపులో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కృషి కీలకం

కృష్ణా జలాల తరలింపులో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కృషి కీలకం

 

మునుగోడు, వెలుతురు, అక్టోబర్ 25 :

కృష్ణా జలాలను మునుగోడు ప్రాంతానికి తరలించే విషయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కృషి కీలకమని మండల కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప అన్నారు. ఏదుల నుంచి డిండి, శివన్నగూడెం ప్రాజెక్టులకు కృష్ణా జలాలను తరలించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు.

దాదాపు మూడేళ్లుగా ఎమ్మెల్యే ప్రాజెక్టుల పనులపై అధికారులు, ఇంజినీర్లతో పలుమార్లు చర్చించి, ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తే ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు తాగునీటి సమస్య తీరడంతోపాటు,బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.గంగను భూమిపైకి తీసుకొచ్చిన భగీరథుడి తరహాలో కృష్ణమ్మను మునుగోడుకు తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసేలా చేసినందుకు నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.