బ్రిక్స్ సమావేశాలకు బయలుదేరిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 26: తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. బ్రిక్స్ సమావేశాల వేదికగా తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను సమావేశాల్లో వివరిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటన విజయవంతం కావాలని పలువురు ఆకాంక్షించారు.
