ఇవాళ బిజెపి దేశవ్యాప్త నిరసనలు
వెలుతురు న్యూఢిల్లీ అక్టోబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ తండ్రిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఖర్గే కామెంట్స్ అవమానకరంగా, అసభ్యకరంగా ఉన్నాయని బీజేపీ మండిపడింది. నేతల కుటుంబ సభ్యులను, చనిపోయిన వారిని టార్గెట్ చేయడం సరికాదని, ఖర్గే అన్ని హద్దులు దాటారని ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ అన్ని రాష్ట్రాల్లో పార్టీ హెడ్ క్వార్టర్స్ వద్ద శాంతియుతంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించింది.
