భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య జాతీయ సమావేశం విజయవంతం..

  • సెక్రటరీ జనరల్‌గా ఎస్.బి. శ్రీనివాస చారి ఏకగ్రీవ ఎన్నిక

వెలుతురు జూన్ 20 హైదరాబాద్: హైదరాబాద్ లో నిర్వహించిన ‌ భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ -1964) జాతీయ జనరల్ బాడీ సమావేశాలు అత్యంత విజయవంతంగా ముగిశాయి. దేశం నలుమూలల నుంచి సుమారు 3,500 మంది జీవిత బీమా ఏజెంట్లు, ప్రతినిధులు మరియు జాతీయ నాయకులు ఈ మహాసభలో పాల్గొన్నారు.సమావేశం అనంతరం జరిగిన ఎన్నికల్లో జాతీయ అధ్యక్షులుగా ఢిల్లీకి చెందిన సతీందర్ సింగ్ కాలా, సెక్రటరీ జనరల్‌గా హైదరాబాద్‌కు చెందిన ఎస్.బి. శ్రీనివాస చారి, జాతీయ ఉపాధ్యక్షులుగా సింగారపు శ్రీనివాస్ , జాతీయ కోశాధికారిగా బొడ్డుపల్లి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను భారతదేశపు నంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, మాజీ సిఎల్ఐఏ ఛైర్మన్, లియాఫీ -1964 జనరల్ బాడీ సమావేశ అడ్వైజరీ కమిటీ సహ-ఛైర్మన్ కౌటికె విఠల్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఇదే రోజు సెక్రటరీ జనరల్ ఎస్.బి. శ్రీనివాస చారి జన్మదినం కూడా కావడంతో, ఆయనను సభా వేదికపై గజమాలతో సత్కరించి, జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ విజయవంతమైన సమావేశం కోసం గత రెండు నెలలుగా నిరంతరం శ్రమించి విశేష కృషి చేసిన ఆయన సేవలను నాయకులు కొనియాడారు.

ఈ సందర్భంగా కౌటికే విఠల్ మాట్లాడుతూ ప్రతి సభ్యుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమాఖ్య చరిత్ర, లక్ష్యాలు, విధానాలను పూర్తిగా తెలుసుకోవాలని, అవసరమైతే సీనియర్ నాయకుల ద్వారా అవగాహన పొందాలని సూచించారు.ప్రతి జీవిత బీమా ఏజెంట్‌కు నాణ్యమైన శిక్షణ అందేలా ఎల్ ఐ సి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆ బాధ్యతను లియాఫీ -1964 ప్రాధాన్యంగా స్వీకరించాలని కోరారు.క్లబ్ సభ్యత్వం పొందిన ఏజెంట్లకు వారి హోదాకు తగిన సౌకర్యాలు, గౌరవం మరియు ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షులు పి. రామస్వామి, ప్రధాన కార్యదర్శి డి. సునీల్ కుమార్, ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ కేంద్ర ఉపాధ్యక్షురాలు ఈ. హేమలత, జోన్ ఉపాధ్యక్షురాలు ఎ. విజయలక్ష్మి, ఎ. రాణి పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.