తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ! సుకుమారీ’. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మించాడు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాట, టీజర్.. సినిమాపై మంచి బజ్ తీసుకు రాగా తాజాగా సోమవారం ఈ సినిమా నుంచి యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి అంటూ సాగే హుషారైన లిరికల్ వీడియోను విడుదల చేశారు.
ఈ పాటకు దర్శకుడు భరత్ దర్శన్ స్వయంగా సాహిత్యం అందించగా భరత్ మాచిరాజు సంగీతంలో ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు, గాయకుడు జెస్సీ గిఫ్ట్ ఆలపించాడు.
