హైదరాబాద్, వెలుతురు ఆగస్టు 3:
తెలంగాణ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బీసీ బిడ్డ, మంత్రి డా. వాకాటి శ్రీహరి ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మత్స్యకార కుటుంబాల అభ్యున్నతినే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా తీసుకుని మంత్రి శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.116 కోట్లను విడుదల చేయించడం పట్ల రాష్ట్రంలోని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి డా. వాకాటి శ్రీహరి ముదిరాజ్ కి రాష్ట్రంలోని ప్రతి మత్స్యకారుడు కృతజ్ఞతలు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భీమ లక్ష్మణ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.
అనంతరం హైదరాబాద్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే, రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డి, డా. వాకాటి శ్రీహరి ముదిరాజ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి, మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేశారు.


