ఒక్క కాలేజీ కూలిస్తే.. వంద నిర్మిస్తాం: ఎంఐఎం ఎమ్మెల్యే  అక్బరుద్దీన్ సవాల్ 

  • ఫాతిమా విద్యాసంస్థల భూ వివాదంపై బీజేపీ–ఎంఐఎం మధ్య మాటల యుద్ధం
  • హైకోర్టు అభ్యంతరాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి సంజయ్
  • ఒవైసీకి ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా అని విమర్శ
  • బీజేపీ ఆరోపణలకు బదులిచ్చిన అక్బరుద్దీన్ ఒవైసీ
  • తమ విద్యాసంస్థలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని స్పష్టం
  • విద్యా సేవలను ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్య
  • భూ వివాదంపై రాజకీయ విమర్శలు మరింత ముదిరిన వేళ స్పందన

హైదరాబాద్ వెలుతురు జూలై 06:

ఫాతిమా విద్యాసంస్థల భూ వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హైకోర్టు అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం ఒవైసీకి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయం చేస్తోందా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

దీనిపై స్పందించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తమ విద్యాసంస్థలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని, ఒక్క కాలేజీ కూల్చితే వంద విద్యాసంస్థలు నిర్మిస్తామని సవాల్ విసిరారు. ఫాతిమా విద్యాసంస్థల భూ వివాదం నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండగా, ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడెక్కుతోంది.

Leave A Reply

Your email address will not be published.