కష్టపడే ఉద్యోగికి ఎక్కడైనా గుర్తింపు: స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి

హైదరాబాద్, వెలుతురు (జూన్ 26):

నిబద్ధతతో, కష్టపడి పనిచేసే ఉద్యోగికి ఎక్కడైనా గుర్తింపు లభిస్తుందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో గత ఏడు సంవత్సరాలుగా డిప్యూటేషన్‌పై డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన సుజాత తన మాతృశాఖ అయిన సహకార శాఖకు బదిలీ అయిన సందర్భంగా శనివారం స్పోర్ట్స్ అథారిటీ ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సోనీ బాలాదేవి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ఉద్యోగులు ఎక్కడ పనిచేసినా తమ పనితీరుతో అధికారుల, సహోద్యోగుల ప్రశంసలు అందుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో కోచ్‌లు, అధికారులు, సిబ్బంది అందరూ సమష్టిగా కృషి చేయడం వల్లనే అనేక క్రీడా టోర్నమెంట్లు, కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలిగామని ఆమె తెలిపారు. డిప్యూటేషన్‌పై స్పోర్ట్స్ అథారిటీలో పనిచేసిన సుజాత అందరితో సమన్వయంతో, అంకితభావంతో విధులు నిర్వహించారని కొనియాడారు. ఆమె తన మాతృశాఖలో కూడా మరింత విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిత, ఇంజనీర్ శ్రీనివాస్, స్టేట్ డైరెక్టర్లు కె.ఆర్. బట్టర్, శాలిని, అశ్విని దడ్పే, పీఆర్‌ఓ కాలేరు సురేష్‌తో పాటు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, ఉద్యోగులు, నాలుగో తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.