హైదరాబాద్, వెలుతురు (జూన్ 26):
దూరవిద్య విధానంలో బిఎ, బికాం, బిఎస్సీ అడ్మిషన్లు కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఏఓయూ) రామాంతపూర్‌లోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో స్టడీ సెంటర్‌ను విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డా. వై వెంకటేశ్వర్లు, EMRRC డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణలు కలిసి ప్రారంభించారు.
2026-27 విద్యా సంవత్సరానికిగాను బిఎ, బికాం, బిఎస్సీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని వాగ్దేవి డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ తెలిపారు. కోర్సులలో చేరాలంటే ఇంటర్మీడియేట్, ఓపెన్ ఇంటర్, 10+2 మరియు పాలిటెక్నిక్ ఐటిఐ రెండు సంవత్సరాలు ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఆధార్ కార్డు, పదో తరగతి, ఇంటర్ మార్కుల జాబితా, కమ్యూనిటీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో కాలేజీలోని ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం కోడ్ 248లో సంప్రదించాలన్నారు. ఈ అడ్మిషన్ల గడువు ఆగస్టు 7 చివరి తేది అని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9000436059, 9985828828, 04029336058 నంబర్లను సంప్రదించాలన్నారు.

