ఏసీబీ వలలో మరో ఇద్దరు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 15 : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూమి మ్యుటేషన్, సర్వే పనుల కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..
హైదరాబాద్ నగరంలోని సంతోష్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలోని మాదన్నపేట సెక్షన్ విద్యుత్ ఏఈగా పనిచేస్తున్న పందాల సంధ్యారాకేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాత మీటర్ల స్థానంలో ఆరు కొత్త విద్యుత్ మీటర్లు ఇవ్వాలని కోరగా అందుకు లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో గురువారం ఏఈ రూ.1.20 లక్షల లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి నందుకు గాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
