తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమల, వెలుతురు, నవంబర్ 26 : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. మరోవైపు, నిన్న 74,873 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22,810 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ద్వారా రూ.3.38 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.
