రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్, వెలుతురు: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వర్ష సూచన తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఆకాశం మేఘావృతమై ఉండి చల్లటి వాతావరణం నెలకొంటుందని ప్రజలకు సూచించారు.
