సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో మల్లు రవి, వంశీకృష్ణ పర్యటన

సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో మల్లు రవి, వంశీకృష్ణ పర్యటన

 

కొండారెడ్డిపల్లి, వెలుతురు, అక్టోబర్ 20 : దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రానున్న నేపథ్యంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.

Leave A Reply

Your email address will not be published.